తనకు ఎమోషన్స్ ఉండవు అని రామ్ గోపాల్ వర్మ చెప్పే మాట అబద్దమా?

RGV (Ram Gopal Varma) emotionsతనకు ఎటువంటి ఎమోషన్స్ లేవని, తనను ఎటువంటి విమర్శలు ప్రభావితం చెయ్యవని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెబుతూ ఉంటాడు. అయితే అదంతా వట్టి మాటే అని ఇప్పుడు నిరూపితం అయ్యింది. రాము తాజాగా పవన్ కళ్యాణ్ పై పవర్ స్టార్ అనే వివాదాస్పద చిత్రాన్ని రూపొందించాడు.

ఆ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాము ఫైర్ అయ్యాడు. సదరు ఇంటర్వ్యూ చేసే అతను … మీరు ఇప్పటివరకు ఎంత మంది అమ్మాయిలను వాడారు అని అడిగాడు. “అది మీకు అనవసరం. ఇది పవర్ స్టార్ ఇంటర్వ్యూ. సినిమాల గురించే మాట్లాడండి,” అని కోపంగా మాట్లాడాడు.

ADVERTISEMENT

బయట ఇదొక టాక్ అని యాంకర్ అని అడిగితే… “బయట టాక్ లోపల టాక్ అనేది అనవసరం. సినిమాల గురించి మాట్లాడండి. నేను ఇంటర్వ్యూ ఇస్తా అనేది పవర్ స్టార్ గురించి. నా పర్సనల్ లైఫ్, సెక్స్ లైఫ్ గురించి మాట్లాడకండి. డోంట్ ట్రై టు బీ స్మార్ట్. ఎవరన్నా అమ్మాయిలు మీ చివిలో చెప్పారా?,” అని ఫైర్ అయ్యాడు.

“మీరు సబ్జెక్టు కి స్టిక్ అయ్యి మాట్లాడకపోతే అనవసరం. నాకు అంత టైం లేదు,” అంటూ రాము తన షర్టుకు ఉన్న మైక్ తీసేసి వెళ్ళిపోయాడు. ఇది ఇలా ఉండగా.. పవర్ స్టార్ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఏదో పవన్ మీద కోపం తో తీసిన సినిమా తప్ప ఎటువంటి విషయం లేదని చుసిన వారు అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories