పోయి పోయి వర్మ మాయ లో పడ్డాడు…లేస్తాడా?

RGV - Ram Gopal Varma- RX100 Director Ajay Bhupathiఒక పక్క యువ హీరో రామ్ తో సినిమా చేస్తూనే మరో పక్క వర్మతో నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఒక కుర్ర దర్శకుడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా. ఇంకెవరు…మన ఆర్ఎక్స్100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి. ఈ యువ దర్శకుడు స్వయానా మన ఆర్జీవీకి శిష్యుడే. అయితే ఆర్జీవీ లేటెస్ట్ మూవీ భైరవగీత సినిమా ఆడియో వేడుకలో ఆర్జీవీ ఈ యువ దర్శకుడిని పొగడ్తలతో ముంచెత్తి ఈ దర్శకుడు ఆర్ఎక్స్100 కాదు ఆర్డీఎక్స్ 100 అంటూ తెగ పొగిడేసాడు ఆర్జీవీ. అంటే కాదట, సినిమాలో ఏదో ఏదో అనే పాటలో ముద్దు సీన్ లు ఏకంగా అజయ్ ఇన్స్పిరేషన్ అంటూ తెగ చెప్పేసాడు వర్మ.

[m9ad]

ADVERTISEMENT

అయితే అసలు ఒకరిని పొగడడం పెద్దగా ఇష్టపడని ఆర్జీవీ అలా ఎందుకు చేసాడో ఇదిగో ఇప్పుడు ఈ వార్త చూస్తే అర్ధం అవుంటుంది. తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ ప్రకారం తాను, యువ దర్శకుడు అజయ్ భూపతి కలసి నిర్మాతలుగా మారి ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాం అని, ఆ సినిమా పేరే “పోస్టర్” అని సినిమా టైటిల్ కూడా రివీల్ చేసేసాడు వర్మ. అయితే ఆర్ఎక్స్ 100 సినిమాకు సమయంలో కనీసం సొంత కారు కూడా లేని ఈ యువ దర్శకుడికి ఆ నిర్మాతలు సినిమా భారీ హిట్ కావడంతో వాళ్లే గిఫ్ట్ గా కారు కొని ఇచ్చారు. అలాంటివాడు నిర్మాతగా ఎలా మారగలడు?

బహుశా ఈ దర్శకుడిని వర్మ తనకు అనుకూలంగా ఎలా వీలైతే అలా వాడుకుంటాడేమొ ఎందుకంటే సినిమా తీసే అంత డబ్బు ఈ కుర్ర దర్శకుడి దగ్గర ఎక్కడ ఉంటుంది? మొత్తంగా చూసుకుంటే పోయి పోయి ఈ యువ దర్శకుడు ఆర్జీవీ మాయలో పడ్డాడు అని చెప్పవచ్చు. మరి ఏమాత్రం తేడా వచ్చినా…ఏముంది ఇంటికి వెళ్ళి ఆర్జీవి “గోవిందా…గోవిందా” సినిమా చూసుకోవడమే.

ADVERTISEMENT
Latest Stories