‘చేసింది చాలా తక్కువ’ అన్న రోజా!

roja fires on kalva srinivasకాల్వ శ్రీనివాసులు బయటపెట్టిన వీడియో ఫుటేజీతో వైసీపీ నాయకుల భాగోతం బట్టబయలు కావడంతో అధికార పార్టీ వర్గీయులపై వైసీపీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. ఓ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి.

“గతంలో చాలా అసెంబ్లీలలో స్పీకర్ మైక్ లు విరగ్గొట్టారని, చైర్లు పగలగొట్టారని, ఒకరిపై ఒకరు కొట్టుకున్నారని, అలాంటి సమయంలో కూడా ఎవరినీ ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేసిన దాఖలాలు లేవని, అలాంటి ఘోరాలు ఏమీ చేయకపోయినా నన్ను మాత్రం సభ నుండి ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేసారని, ఇదంతా చంద్రబాబు కుట్ర అని” రోజా ఆరోపణలు చేస్తోంది.

చేసిన చేష్టలు, పలికిన మాటలే దారుణాలని అందరూ ముక్కున వేలేసుకుంటుంటే, మేం చేసింది చాలా తక్కువ అని సమర్ధించుకోవడం బహుశా వైసీపీ నేతల వల్లే అవుతుందేమో! బహుశా రోజా చెప్తున్న మైక్ లు విరగ్గొట్టడం, చైర్లు పగలగొట్టడం వంటివి తదుపరి జాబితాలో ఉన్నాయేమోనన్న భావన సోషల్ మీడియా వర్గాలలో వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories