కేసీఆర్ మనవడి ఇరవైయేడు వేల టీ-షర్టు

Roja Meets KCR on his birthdayతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నిన్న తన 66వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా తెరాస శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఏపీలో అధికార పక్షం తెరాస ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ ను శుభాకాంక్షలతో ముంచెత్తారు.

వైఎస్సార్ కాంగ్రెస్ నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసి చైర్ పర్సన్ రోజా అయితే ప్రగతి భవన్ కు వెళ్లి మరీ కేసీఆర్ ని విష్ చేసి వచ్చారు. రోజా, కేసీఆర్, కేసీఆర్ మనవడు హిమాంశు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హిమాంశు ఈ ఫొటోలో వేసుకున్న నల్ల రంగు టీ-షర్టు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

ADVERTISEMENT

సోషల్ మీడియాలో ఒక్క యూజర్ ఆ టీ-షర్టు రేటు బయట పెట్టాడు. ఆ టీ-షర్టు అక్షరాలా 27,111 రూపాయిలు. కొందరేమో దీని గురించి నెగటివ్ గా మాట్లాడుతుండగా, కొందరేమో ముఖమంత్రి మనవడు అంటే ఆ మాత్రం రేంజ్ ఉంటుంది అని సమర్థిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా… కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ… పలువురు ప్రముఖులు నగరంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి అభిమానం చాటుకుంటున్నారు. ముందుగా చెప్పినట్టుగా నాయకులు చాలా మంది నిన్న మొక్కలు నాటారు. కేసీఆర్ ని కలవడానికి వచ్చిన నేతలు కూడా మొక్కలు తీసుకుని రావడం విశేషం. మరోవైపు.. దక్షిణాఫ్రికా, మలేషియా తదితర దేశాల్లో సైతం టీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగం నాయకులు కేసీఆర్‌ బర్త్‌డేను ఘనంగా నిర్వహించారు. Roja Meets KCR on his birthday

ADVERTISEMENT
Latest Stories