తమిళ హీరోల హవా తెలుగులో కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉంది. అప్పటి రజనీకాంత్ మొదలుకుని ఇప్పటి బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంథోనీ వరకూ తమిళ హీరోలు తెలుగులో బాక్స్ ఆఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. అయితే అందులో కొందరు సక్సెస్ అయితే ఎక్కువశాతం ఫెయిల్ అయ్యారు. ఇక ఆ ఎక్కువశాతం లోకే వచ్చి చేరింది మరో హీరో కధ కూడా ఆ హీరోనే మన బిచ్చగాడు ఫేమ్ ‘విజయ్ ఆంథోనీ’.
[m9ad]
తాజాగా రోషగాడు అంటూ తెలుగు ప్రేక్షకులకు తన ప్రతాపం చూపించిన విజయ్. ఈ సినిమాతో మరోసారి తెలుగులో చేదు అనుభవాన్ని రుచి చూశాడని చెప్పవచ్చు. బిచ్చగాడు మినహా మిగిలిన సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో నిర్మాతలు భారీగానే నష్టపోయారు. విజయ్ ఆంథోనీ తోలి సినిమాని దృష్టిలో పెట్టుకుని అది 18 కోట్ల వసూళ్ళు సాధించడంతో అదే ఊపులో వరుసగా విజయ్ సినిమాలు కొంటూ వస్తున్న నిర్మాతలు పాపం పెట్టిన పెట్టుబడుకికి కనీసం కట్టే వడ్డీ కూడా రాకపోవడం వల్ల లబో దిబోమంటున్నారు.
పోనీ ఇన్ని సినిమాలు పోయాయి కదా అని రేపు విజయ్ ది ఇంకో సినిమా కొనడం మానేస్తారా అంటే అదీ జరగదు. ఏది ఏమైనా ఇక విజయ్ ఆంటోనీ యాత్ర దాదాపుగా తెలుగులో ముగిసినట్లే.



