“ఆర్ ఆర్ ఆర్” టార్గెట్ ఎంతో తెలుసా?

Ram Charan -Jr NTR - RRR Launchఆర్ ఆర్ ఆర్! ఒక పక్క టాలీవుడ్ టాప్ హీరోలయిన ఎన్టీఆర్, రామ్‌చరణ్, మరో పక్క టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కలసి తెరకెక్కిస్తున్న అద్భుత చిత్రం అనే చెప్పాలి. ఈ సినిమా టైటిల్ అలా బయటకు వచ్చిందో లేదో, ఆ క్షణం నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఇక రికార్డుల మోత షురూ అని ఇప్పటికీ అటు ప్రేక్షకులు, ఇటు ఇండస్ట్రీ వాళ్ళు తెగ మాట్లాడేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా కధ కధనం పై రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్న తరుణంలో అసలు ఈ సినీ ఆ టార్గెట్ ఏంటి? రాజమౌళి ఈ ఇద్దరి భారీ హీరోలను పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటే…ముందుగా ఈ ఇద్దరి కాంబినేషన్ తో రాజమౌళి అభిమానుల మధ్య ఉన్న పొరపత్యాలను దూరం చెయ్యాలి అన్న ఆలోచనతో ఉన్నాడు.

ADVERTISEMENT

[m9ad]

మరో పక్క ఫాన్స్ ఎక్కడా హర్ట్ అవకుండా ఇద్దరి పాత్రలను ఒకే స్థాయిలో ఉంచాడట జక్కన్న. ఇక మరో పక్క ఏ సినిమా కోసం ఏకంగా బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ సైతం రాజకీయం చేస్తున్నాడట. ఈ సినిమాకి తన బావమరిది ఆయుష్ శర్మని విలన్ గా చేసే క్రమంలో సల్లు భాయ్ పావులు కదుపుతునట్లు సమాచారం. మరో పక్క సల్లు భాయ్ బావమరిది జక్కన్న కుమారుడు కార్తికేయకు మంచి స్నేహ బంధం ఉండడంతో ఆరకంగా ఈ సినిమాలో ఆయుష్ శర్మకి మంచి పాత్ర దక్కేలా సల్మాన్ ఖాన్ తెగ ప్రయత్నిస్తున్నాడట. అయితే అసలు ఈ సినిమా బిజినెస్ విషయంలో రాజమౌళి ఏం చెయ్యబోతున్నాడు? దాదాపుగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా బిజినెస్ విషయంలో రాజమౌళి ప్లాన్ ఏంటి అంటే? ఫిల్మ్ నగర్ విశ్వసనీయ వర్గాల నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లట. ఇక ఈ సినిమా టార్గెట్ 600 కోట్లుగా ఫిక్స్ అయ్యాడట మన జక్కన్న. మరో పక్క మూడు బాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు శాటిలైట్ రైట్స్ ద్వారానే దాదాపుగా 200 కోట్ల వరకూ వసూలు చెయ్యాలి అనేది జక్కన్న ప్లాన్ గా తెలుస్తుంది.

ఇక అంతా ఒకే కానీ, అసలు ఈ సినిమాకి జక్కన్న ఎంత పారితోషకం తీసుకుంటున్నాడు అని అంటే, ఈ సినిమా సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం ఆయన ఈ సినిమాకి ప్రత్యేకంగా రెమ్యునిరేషన్ ఏమీ తీసుకోవడం లేదు, కానీ షేర్ మాత్రమే తీసుకోనున్నాడట. ఇక ఆ షేర్ విలువ దాదాపుగా 75 నుంచి ౮౦ కోట్ల వరకూ ఉండవచ్చు అని అంచనా. మొత్తంగా అదీ ‘ఆర్ ఆర్ ఆర్’ తో జక్కన చెయ్యనున్న మాయాజాలం.

ADVERTISEMENT
Latest Stories