ఈ దశాబ్దపు బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా టాలీవుడ్ లో రంగం సిద్ధమవుతున్న రాజమౌళి – రామారావు – రామ్ చరణ్ ల సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్ళబోతోంది. దీపావళికి రెండు రోజుల ముందుగా అంటే నవంబర్ 5వ తేదీ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి కావడంతో, ప్రస్తుతం రాజమౌళి అండ్ కో ఇతర విభాగాలపై దృష్టి సారిస్తున్నారు.
[m9ad]
ADVERTISEMENT
ఇక సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తారక్ – చెర్రీలు ఒకేసారి సెట్స్ పైకి రావడానికి మాత్రం కొంతసమయం పట్టనుంది. ముందుగా ఎన్టీఆర్ నవంబర్ 3వ వారం నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటుండగా, రామ్ చరణ్ మాత్రం బోయపాటి సినిమా పూర్తయిన తర్వాత డిసెంబర్ లో హాజరు కానున్నారు. మొత్తానికి షూటింగ్ కు సన్నాహాలు జరుగుతుండడంతో ఇరు హీరోల అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.
ADVERTISEMENT



