జనసేనలోకి రాబోతున్న పవన్ విధేయుడు?

rumours Comedian Ali joining janasenaపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా ఉన్నంత కాలం టాలీవుడ్ నుండి యెనలేని సహకారం అందుకున్న పవన్ కు, జనసేనకు మాత్రం ఆశించిన స్థాయిలో తోడ్పాటు లభించలేదన్నది వాస్తవం. దేవుడు అంటూ నిత్యం కొలిచే బండ్ల గణేష్ వంటి వారే, ‘సినిమాలు వేరు, రాజకీయం వేరు’ అంటూ పవన్ ను సైడ్ చేసిన నేపధ్యంలో… సినీ పరిశ్రమ పరంగా మెగా ఫ్యామిలీ తప్ప పవన్ కు పెద్దగా అండదండలు కనిపించడంలేదు.

ADVERTISEMENT

[m9ad]

ఇలాంటి తరుణంలో ప్రముఖ కమెడియన్ అలీ, త్వరలో జనసేన జెండా పట్టుకొబోతున్నారని తెలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా నేడు రొట్టెల పండగలో పవన్ తో పాటు అలీ కూడా నెల్లూరు బయలుదేరడాన్ని పేర్కొంటున్నారు. బరషహీద్ దర్గాలో ప్రార్ధనలు నిర్వహించేందుకు అని బయటకు చెప్తున్నప్పటికీ, అలీ పొలిటికల్ ఆరంగ్రేటం ఖాయంగా కనపడుతోంది. కనీసం అలీ అయినా జనసేనకు సుముఖంగా చూపుతున్నందుకు ఒక విధంగా అభిమానులు హ్యాపీ.

ADVERTISEMENT
Latest Stories