సీనియర్ నటీనటులను స్వర్గస్తులను చేయడం ఇటీవల కాలంలో చాలా రెగ్యులర్ గా జరుగుతోన్న విషయం. ఎవరైనా సీనియర్ నటులు హాస్పిటల్ పరిసర ప్రాంగణాలలో కనిపించడమే ఆలస్యం… వార్తలు అమాంతం వైరల్ అవుతూ… చివరికి వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. తాజాగా ఈ ఉదంతానికి బలైన వ్యక్తి…. లెజండరీ ఆర్టిస్ట్ కోట శ్రీనివాసరావు.
కోట ‘కాలం చేసారు’ అంటూ వస్తున్న వార్తల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తపరిచిన కోట, తనకేం కాలేదని స్పష్టత ఇచ్చారు. అయినా హాస్పిటల్ పరిసరాల్లో కనిపించడమే పాపమా… బంధువులను చూడడానికైనా హాస్పిటల్ కు వెళ్తాం కదా! అలాగే ఈ వయసులో కాలు నొప్పో రావడం సహజమే కదా! అంతమాత్రం దానికి ఇలాంటి ప్రచారం చేస్తారా? అంటూ మండిపడ్డారు.
ఇలా తనకు ఒక్కడికే జరగలేదని, గతంలో చాలామంది ఇలా ఇబ్బందులు పడిన వారేనని, తన విషయానికి వస్తే తాను చాలా మొండివాడినని, ఎవరు ఏమన్నా తట్టుకోగలనని, కానీ తన బంధువులను, అభిమానులను ఇబ్బంది పెట్టే హక్కు ఎవరికీ లేదని కాస్త గట్టిగానే చెప్పారు. సెలబ్రిటీలపై చూపుతున్న అత్యుత్సాహమే ఇలాంటి వార్తల జననానికి కారణంగా పేర్కొనవచ్చు.



