పవన్ కళ్యాణ్ హరీష్ సినిమాపై ఆసక్తికరమైన చర్చ

rumours on pawan kalyan harish shankar movieజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, పింక్ రీమేక్ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా కొన్ని రోజులు క్రితం అల్యూమినియం ఫ్యాక్టరీ లో ముహూర్తం జరుపుకుంది.

ఈ లోగా ఆయన మూడవ చిత్రం…. గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ తో ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాపై అనేక పుకార్లు వినిపిస్తుండడం విశేషం. కొందరు ఈ సినిమా గబ్బర్ సింగ్ లాగే రీమేక్ అని అంటుంటే… కొందరు తెలంగాణాలోని ఒక విప్లవకారుడి స్టోరీ అంటున్నారు. ఈ ఏడాది చివరన ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.

ADVERTISEMENT

దానితో హరీష్ కు స్క్రిప్ట్ పక్కాగా రాసుకునే టైం దొరుకుతుంది. ఇప్పుడు అభిమానులు హరీష్ గబ్బర్ సింగ్ లాంటి మరో భారీ హిట్ ని ఇస్తాడని నమ్మకం తో ఉన్నారు. అయితే ఈ పుకార్ల మధ్య వారికి సినిమా సబ్జెక్టు ఏమై ఉంటుంది అనే టెన్షన్ మొదలయ్యింది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

అంటే ఈ వేసవి నుండి వచ్చే వేసవి మధ్యలో పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఇది ఇలా ఉండగా ఇన్ని సినిమాలు… రాజకీయాలకు పవన్ కళ్యాణ్ టైం ఎలా కేటాయిస్తారు అనేది చూడాల్సి ఉంది. మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories