రష్మి థైస్ పై దర్శకుడు హాట్ కామెంట్!

RX 100 Director Vijay Bhupathi -Comments on Rashmi Gautam Thighs“ఆర్ఎక్స్ 100” సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన డైరెక్టర్ అజయ్ భూపతి, తాజాగా హాట్ హాట్ కామెంట్స్ కు తెరలేపారు. ‘జబర్దస్త్’ బ్యూటీ రష్మి ప్రధాన పాత్రలో నటించిన “అంతకుమించి” సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న అజయ్ భూపతి, పోస్టర్ లో ఉన్న రష్మి థైస్ కు ఫిదా అయిపోయానని వ్యాఖ్యానించారు.

[m9ad]

ADVERTISEMENT

తన “ఆర్ఎక్స్ 100” ఫస్ట్ లుక్ పోస్టర్ కు పక్కన చాన్నాళ్ళ వరకు ఓ హార్డింగ్ ఖాళీగా ఉంది. ఆ తర్వాత ‘అంతకుమించి’ పోస్టర్ ను పెట్టారు, ఆ హార్డింగ్ లో రష్మి థైస్, బ్యాక్ గ్రౌండ్ లో బీచ్ చూసి… ఒక ఆడియన్ గా చెప్తున్నాను నేనే కనెక్ట్ అయిపోయాను, మీరు కూడా కనెక్ట్ అవ్వండి… తప్పదు అంటూ నవ్వేసారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో రష్మి కూడా అదే వేదికపై ఉంది.

ఇక ‘అంతకుమించి’ సినిమా గురించి చెప్తూ… హార్రర్, థ్రిల్లర్ మూవీస్ ను తెరకెక్కించడం చాలా కష్టమైన పని అని, సౌండ్ ను దృష్టిలో పెట్టుకుని కట్ చేయాల్సిన సీన్స్ చాలా ఉంటాయి గనుక, ఇతర జోనర్ సినిమాలతో పోలిస్తే, ఈ జోనర్ మూవీస్ కష్టమని, కానీ ఈ సినిమా బాగా వచ్చిందని అజయ్ భూపతి అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT
Latest Stories