‘కింగ్’ నాగార్జున – నాచురల్ స్టార్ నానిలు నటించిన “దేవదాస్” సినిమా గురువారం నాడు రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ్ – నానిలు ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తుండగా, ఈ సినిమాలో నాగ్ పై ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తీకేయ ఓ అదిరిపోయే ట్వీట్ వేసాడు. ఈ ట్వీట్ చూసిన అక్కినేని అభిమానులు ‘ఇది నిజమే’ అంటున్నారు.
[m9ad]
‘దేవదాస్’ సినిమాలో షర్ట్ లెస్ గా కనపడుతోన్న నాగార్జున ఫోటోను పోస్ట్ చేసి, వికీపీడియా తప్పు చూపిస్తోందా? ఎందుకంటే ఈ మనిషి 59 ఏళ్ళ వయసులా ఉన్నారా? 20 ఏళ్ళ వయసులో ఉన్న హీరోలకు పోటీఇస్తున్నాడు, ఏం ఉన్నాడ్రా బాబూ… అంటూ హీరో కార్తీకేయ ట్వీట్ వేసాడు. నిజానికి ఒక్క కార్తీకేయే కాదు, సినిమా చూసిన ప్రేక్షకులది కూడా ఇదే అభిప్రాయం.
Is wikipedia wrong ?coz it says this man is 59yrs old .#Devadasu .@iamnagarjuna sir 🙏🙏🙏 challenging actors in 20s with his fitness levels.Em unnadra babu🙏🙏 pic.twitter.com/5D1tcZ75t8
— Kartikeya (@ActorKartikeya) September 27, 2018



