హిట్టు కొట్టు… కారు పట్టు… న్యూ ఫిలాసఫీ..!

Wedding & Jeep Car Gift for Rx 100 Director Ajay Bhupathiహీరోల క్రేజ్ ను పెంచడంలోనూ, నిర్మాతలకి లాభాలను తెచ్చిపెట్టడంలోనూ దర్శకులదే ప్రధానమైన పాత్ర. అందుకే అటు నిర్మాతలు, ఇటు హీరోలు కూడా దర్శకులకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ వుంటారు. తమకి మంచి సినిమా చేసి పెట్టినందుకుగాను ఖరీదైన కానుకలను దర్శకులకు అందజేస్తూ తమ కృతజ్ఞతను చాటుకుంటూ వుంటారు. తమకి మంచి సక్సెస్ ను అందించినందుకు హీరోలు, మంచి లాభాలు తెచ్చిపెట్టినందుకు నిర్మాతలు దర్శకులకు ఖరీదైన కారును కానుకగా ఇవ్వడమనేది ఇండస్ట్రీలో ఆనవాయితీగా మారుతోంది.

తమిళంలో అజిత్… సూర్య… విజయ్ లు ఇలా దర్శకులకు కార్లను గిఫ్ట్ గా ఇస్తుంటారు. ఆ మధ్య ‘శ్రీమంతుడు’ హిట్ సందర్భంలో ప్రిన్స్ మహేష్ బాబు కూడా కొరటాల శివకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు. తాజాగా ఇదే కోవలో ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో భారీ లాభాలను తెచ్చిపెట్టిన దర్శకుడు అజయ్ భూపతికి నిర్మాత అశోక్ గుమ్మకొండ ఖరీదైన ‘జీప్’ కారును కానుకగా అందజేశారు. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి, ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories