
యుక్త వయసులో ఉన్న కొంతమంది యువతులు అయ్యప్పస్వామిని దర్శనం చేసుకుంటూ కనిపిస్తున్న ఈ ఫోటో వైరల్ గా మారింది. కొల్లాంకు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుటుంబ సమేతంగా శబరిమలకు వచ్చినప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ప్రాధమికంగా అందుతున్న సమాచారం. అయితే నిబంధనలను అతిక్రమించి మహిళలు ఆలయంలోకి ఎలా వెళ్లారు? అన్నది హాట్ టాపిక్ అయ్యింది.
ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కేరళ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఈ ఫోటోపై జాతీయ మీడియాలలో కూడా ప్రధానంగా కధనాలు ప్రసారమయ్యాయి. అయితే ఇది నిజమైన ఫోటోనా? లేక కంప్యూటర్ ఫోటోషాప్ ప్రతిభావంతుల ఫోటోనా? అన్నది విచారణలో తెలియాల్సి ఉంది.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…