ఆ మెగా హీరోకు ఈ టైంలో రిస్క్ అవసరమా?

 Sai Dharam Tej - Director deva katta political movieపిల్లా నువ్వు లేని జీవితం మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాడు తేజ్. కెరీర్ మొదట్లో మంచి హిట్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత చాలా సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చాయి.

ఏకాంగా డబల్ హైట్రిక్ ప్లాపులు రావడంతో ఇక తన పని అయిపోయింది అనుకున్నారు అంతా. ఈ తరుణంలో చిత్రలహరి అనే యావరేజ్, ప్రతిరోజు పండగే వంటి సూపర్ హిట్ తో మళ్ళీ తన సత్తా చాటాడు ఈ యువ హీరో. ప్రస్తుతం మే 1న విడుదల కాబోయే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాపై కూడా ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి.

ADVERTISEMENT

ఈ తరుణంలో సాయి ధరమ్ తేజ్ ఒక నిర్ణయం అభిమానులను షాక్ కు గురి చేస్తుంది. దేవ కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు. భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేథా.. సాయి తేజ్ సరసన నటించనుంది. ఇది రాజకీయ నేపథ్యంలో సాగే సీరియస్ సినిమా అని సమాచారం.

సాయి ధరమ్ తేజ్ కేరీర్ నిలదొక్కుకుంటుంది అనే సమయంలో ఇటువంటి చిత్రం చెయ్యడం రిస్క్ అనే చెప్పుకోవాలి. పైగా వెన్నెల, ప్రస్థానం సినిమాల తరువాత దేవ కట్టాకు సరైన హిట్ లేదు. మొన్న ఆ మధ్య ప్రస్థానం బాలీవుడ్ లో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. ఈ తరుణంలో అతనికి ఛాన్స్ ఇవ్వడం అంటే తేజ్ రిస్క్ చేస్తున్నాడు అనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories