‘మెగా హీరో’ సినిమాపై చెలరేగిన పుకార్లకు ‘శుభంకార్డు’

Fans backlash on Sai Dharam Tej for titleచిరంజీవి చాటున మనుగడ సాగిస్తున్న మెగా వారసులలో మేనల్లుడు సాయి ధరం తేజ్ ఒకరు. వరుసగా కమర్షియల్ చిత్రాలను చేస్తూ బిజీగా ఉన్న సాయి చిత్రాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ‘హైలైట్’ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ సినిమా పేరును సాయి ధరం తేజ్ తన కొత్త సినిమాకు ఉపయోగించుకుంటున్నారని వార్తలు సందడి చేసాయి.

ఈ ప్రచారంపై మెగా అభిమానులంతా ఒక్క తాటిపైకి వచ్చి సాయి సినిమాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ‘గ్యాంగ్ లీడర్’ అంటే ఒక్క మెగాస్టార్ మాత్రమేనని, ఇంకెవరూ ఉండరనే నినాదం తీసుకోవడంతో ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా లభిస్తున్న సమాచారం మేరకు సాయి ధరం తేజ్ నటిస్తున్న ఏ సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ ను పరిశీలించలేదని, ఇదంతా ఒట్టి పుకార్లు మాత్రమేనని స్పష్టమైంది.

ADVERTISEMENT

బహుశా సోషల్ మీడియాలో మెగా అభిమానుల నుండే వచ్చిన వ్యతిరేకత చూసైనా వెనక్కి తగ్గినా తగ్గి ఉండవచ్చు అనే మాటలు కూడా వినపడుతున్నాయి. ఏది ఏమైనా టాలీవుడ్ లో ‘గ్యాంగ్ లీడర్’ అంటే ఒక్క ‘మెగాస్టార్’ మాత్రమే అని మెగా ఫ్యాన్స్ నిరూపించారు.

ADVERTISEMENT
Latest Stories