
ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. అవి వాతావరణ శాఖ ద్వారా కావచ్చు లేదా పశుపక్ష్యాదుల ద్వారా కావచ్చు లేదా మరో రూపంలో కనిపించవచ్చు. అదేవిదంగా ఈసారి ఎన్నికలలో వైసీపి ఓటమికి ఆరు నెలల ముందు నుంచే అనేక సంకేతాలు కనిపిస్తున్నాయి.
క్లుప్తంగా చెప్పుకోవాలంటే చంద్రబాబుని రాజకీయంగా అడ్డు తొలగించుకోవాలనే దురాలోచనతో అరెస్ట్ చేయించడం, టిడిపితో జనసేన ఆ తర్వాత బీజేపీ పొత్తులు, ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం వంటివి అనేకం ఉన్నాయి.
వాటికి కొనసాగింపుగా ఈసారి పోలింగ్‌కు భారీగా జనం పోటెత్తడం, పోలింగ్ సమయంలో, తర్వాత వైసీపి మూకల అల్లర్లు, ఈసీ, ఎన్నికల సంఘం, పోలీసులను వైసీపి నేతలు నిందిస్తుండటం, కౌంటింగ్‌లో ఘర్షణలు తప్పవని హెచ్చరిస్తుండటం వంటి సంకేతాలు వైసీపి నేతలే ఇస్తున్నారు.
వైసీపి ఓటమికి ముందే మరో సారి ఓడిపోవడం విశేషం. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కక్ష కట్టి 5 ఏళ్ల పాటు వేధించింది. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు, క్యాట్ (కేంద్ర పరిపాలన ట్రిబ్యూనల్) అన్నీ జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ ఆయనకు అనుకూలంగా తీర్పులు ఇవ్వడంతో ఈరోజు ఆయన పదవీ విరమణ చేసే రోజున తిరిగి ఆయనను సర్వీసులోకి తీసుకోవాలని నిర్ణయించింది.
సిఎస్ జవహార్ రెడ్డి ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నేడు ఆయన సర్వీసులో చేరిన తర్వాత వెంటనే పదవీ విరమణ చేయనున్నారు. ఒక ప్రభుత్వం తన అధీనంలో పనిచేసే ఓ అధికారిని ఇంతగా వేధించిన ఘటనలు చాలా అరుదుగా కనిపిస్తాయి.
జగన్ ప్రభుత్వం ఆయనను 5 ఏళ్ళు వేధించి పైశాచిక ఆనందం అనుభవించిందనే చెప్పాలి. కానీ చివరికి కోర్టు తీర్పులకు తలొగ్గక తప్పలేదు.
సుదీర్గ న్యాయపోరాటాలు చేసి పదవీ విరమణ రోజునైనా తిరిగి సర్వీసులో చేరడం ఆయన నైతిక విజయమనుకుంటే, ఆయనను పదవీ విరమణ రోజున సర్వీసులో చేర్చుకోవడం జగన్ ప్రభుత్వం నైతిక పరాజయంగానే పరిగణించవచ్చు. కనుక వైసీపి ఓటమికి ముందు ఈవిదంగా కూడా ఓడిపోయిందని చెప్పవచ్చు.
ఇక 5 ఏళ్ళుగా అటు ప్రభుత్వంలోనూ, ఇటు వైసీపిలోని ఓ వెలుగు వెలుగుతున్న సజ్జల రామకృష్ణా రెడ్డిపై తాడేపల్లి పోలీసులే నేడు క్రిమినల్ కేసు నమోదు చేయడం చెంపదెబ్బ వంటిదే అని అనుకోవచ్చు.
వైసీపి కౌంటింగ్‌లో ఏజంట్ల శిక్షణా కార్యక్రమంలో ఆయన వారిని కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు పాల్పడాలన్నట్లు చెప్పినందుకు టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఫిర్యాదు చేయగా, పోలీసులు సజ్జల రామకృష్ణా రెడ్డిపై సెక్షన్స్ 153,505,125 కింద ఇనతకాలం ఆయన కనుసన్నలలో పనిచేసిన తాడేపల్లి పోలీసులే కేసు నమోదు చేశారు.
చేసిన పాపాలకు ఎప్పుడో ఎక్కడో శిక్ష పడుతుందో లేదో తెలీదు కానీ వైసీపి నేతలకు మాత్రం అప్పుడే అవి మొదలైన్నట్లే కనిపిస్తున్నాయి.
చిరంజీవి చెప్పిన్నట్లుగా ‘ఇన్ ఫ్రంట్ దేరీజ్ క్రాకడైల్ ఫెస్టివల్’ కూడా తప్పక ఉంటుంది. కనుక ఆ ఫెస్టివల్‌కి అందరూ ‘సిద్దం’గా ఉండక తప్పదు.
Anand Deverakonda and Vaishnavi Chaitanya’s Epic is facing brutal trolling after its OTT premiere on…
దేశంలో లక్షలాది ప్రజల ఓట్లు ‘చోరీ’ అయ్యాయంటూ సీజేపీ, కాంగ్రెస్ మిత్రపక్షాల అధ్వర్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టుబడుతూ…