అసలు పెళ్లి చేసుకోను అని భీష్మించుకుని కూర్చుని… ఒక రకంగా దేశంలోని బ్యాచిలర్లంతా గురువుగా భావించే బాలీవుడ్ ‘కండల వీరుడు’ సల్మాన్ ఖాన్ ఈ ఏడాది చివరికి ఓ ఇంటివాడు కానున్నాడంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటన్నింటిని నిజం చేస్తూ ప్రీతి జింటా వివాహ రిసెప్షన్ సందర్భంగా సల్మాన్, లులియా వంతూర్ తో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు. దీంతో వీరి వివాహం ఖాయం అన్న ఫీలింగ్ కి బాలీవుడ్ వచ్చేసింది.
ఎందరికో జీవితం ఇచ్చిన సల్మాన్ కు వివాహం జరిగిపోవడం పట్ల అంతా బాధగా ఉన్నప్పటికీ, ఇప్పటికైనా వివాహం చేసుకుంటున్నాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సల్మాన్ జీవితంలో ఇదే తొలి వివాహం. కానీ, సల్మాన్ కాబోయే భార్యగా చెబుతున్న లులియా వంతూర్ విషయం ఏంటంటే? ఆమెకి ఇది రెండో వివాహం. రోమేనియాకి చెందిన లులియా వంతూర్ మోడల్ గా పని చేసేది.
ఆ సమయంలోనే రొమేనియన్ సూపర్ స్టార్ మారిసయ్ మెగాను వివాహం చేసుకుంది. నాలుగేళ్ల వీరి దాంపత్యం విఫలమై, విడాకులు తీసుకున్నారు. దీంతో సల్మాన్ తో ఆమె వివాహం కానుందని తెలుస్తోంది. ఇదే జరిగితే, 2016లో ఒక అద్భుతం జరిగినట్లేనని బాలీవుడ్ ప్రియులు కొనియాడుతున్నారు.



