‘ఆటో జానీ’ అవతారంలో ‘సూపర్ స్టార్’

salman-khan-auto-driver-1000rs‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి ఆటోలో మెగాస్టార్ చిరంజీవి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే ఫీట్ ను బాలీవుడ్ ‘సూపర్ స్టార్’ సల్మాన్ ఖాన్ పాటించాడు. తన సోదరుడు సొహైల్ ఖాన్ పుట్టినరోజు వేడుకల కోసం సల్మాన్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ముంబైలో బయటకు వెళ్లి, బర్త్ డే వేడుక ముగియగానే తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు మాత్రం కారులో కాకుండా ఆటో ఎక్కాడు సల్మాన్ ఖాన్.

ఆటోలో సల్మాన్ ఇంటికి చేరుకునే సరికి అయిన మీటరు ఛార్జి 50 రూపాయలు అయితే, సల్మాన్ మాత్రం రూ.1000 ఇవ్వడంతో డ్రైవర్ ఆశ్చర్యపోయాడు. తన ఆటో ఎక్కిన సల్మాన్ ఏం మాట్లాడలేదని, వేగంగా వెళ్లమని మాత్రం చెప్పాడని, ఇంటి దగ్గర దింపాక, ఆయన కారు డ్రైవర్ తో మాట్లాడమని తనకు చెప్పారని తెలిపాడు. సల్మాన్ ఖాన్ కారు డ్రైవర్ తన చేతిలో 1000 పెట్టి చిరునవ్వు చిందించారని ఆటో డ్రైవర్ సంజయ్ కుమార్ సింగ్ చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

అయితే సల్మాన్ ఖాన్ ‘ఆటో జానీ’ అవతారం దాల్చడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఫీట్లను అరుదుగా చేస్తూ అభిమానులకు సర్ ప్రైజ్ చేస్తుంటాడు సల్మాన్. అయితే 50 రూపాయలకు 1000 రూపాయలు చెల్లించి తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు ఈ కండల వీరుడు. సల్మాన్ నటించిన “ట్యూబ్ లైట్” సినిమా ఈ నెల 23వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories