మళ్ళీ కెమెరాకు చిక్కిన సమంత – చైతన్య!

samanatha-ruth-prabhu-naga-chaitanya-mamagotoఏదో ఒక్కసారి అయితే ఎందుకో కలిసి ఉంటారులే అనుకుంటారు. కానీ, పదే పదే తరచుగా కలుసుకుంటూ ఉంటుంటే… ముఖ్యంగా వారిద్దరూ ‘ఆడ – మగ’ అయితే.., ఆ ఇద్దరి మధ్య ‘సంథింగ్ సంథింగ్’ ఉందని చెవులు కొరుక్కోవడం ప్రస్తుత సభ్యసమాజంలో జరిగే అతి సాధారణ విషయం. అయితే… ఆ ఇద్దరూ కూడా సినీ సెలబ్రిటీలైతే… అప్పుడు అవుతుంది అసలైన హాట్ టాపిక్.

గత కొన్ని రోజులుగా సమంత – నాగచైతన్యలు చేస్తున్నది ఇదే. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ధియేటర్, కాఫీ క్లబ్… తాజాగా షాపింగ్ మాల్ నుండి మరొక ఫోటో వచ్చి చేరింది. ఇద్దరూ కలిసి ఏదో షాపింగ్ చేసుకుని తిరిగి వస్తున్నట్లుగా కనపడుతున్న ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది. ‘ప్రస్తుతం వారిద్దరి మధ్య ఉన్న ఆ కొద్ది దూరం… త్వరలోనే మటుమాయం అయిపోతుందని’ నెటిజన్లు చేస్తున్న కామెంట్లు కొకొల్లలు.

ADVERTISEMENT

ఇక అధికారిక ప్రకటనే తరువాయి… వీరిద్దరి పరిణయానికి అక్కినేని అభిమానులు మానసికంగా సిద్ధంగా ఉండాలన్న సూచనలు వస్తున్నాయి. ఇంతకు ముందు ప్రచారం జరిగినట్లుగా డిసెంబర్ ముహూర్తం వరకైనా ఆగుతారో లేక దానిని కూడా ఇంకాస్త ముందుకు జరుపుతారో చూడాలి. మొత్తానికి చైతూ – సమంతల జీవితం ఓ దారి కాబోతోందన్న మాట.

ADVERTISEMENT
Latest Stories