సమంత… ఫస్ట్ లుక్ లోనే పడేసింది..!

Samantha Akkineni - U - Turn First Look Talkసమంత ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లోకి రీమేక్ అవుతోన్న చిత్రం “యు టర్న్.” సెప్టెంబర్ 13వ తేదీన విడుదల కాబోతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. టైటిల్ సరిగ్గా కనపడలన్నా ‘యు టర్న్’ తీసుకుంటే తప్ప తెలియదు అనిపించే విధంగా డిజైన్ చేసారు. మొత్తంగా టైటిల్ డిజైన్ నుండే చిత్ర యూనిట్ క్రియేటివిటీ ఏమిటో చాటిచెప్పే విధంగా కనపడుతోంది.

అందాల బొమ్మ సమంత, రక్తం, రహదారి మరియు వానలో వెళ్తోన్న కారు… తదితర అంశాలతో ఆసక్తికరంగా పోస్టర్ ను మలిచారు. నిజానికి సినిమా ‘థీమ్’ ఏంటో మొత్తం ఈ పోస్టర్ లో చెప్పే విధంగా రిలీజ్ చేసారు. ఫస్ట్ లుక్ లోనే పడేసిన ఈ సినిమాకు పవన్ కుమార్ దర్శకత్వం వహించగా, ఇతర పాత్రలో ఆది పినిశెట్టి, రాహుల్ రవిచంద్రన్, భూమిక చావ్లాలు కనువిందు చేయనున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories