సమంత – అవుట్ ఆఫ్ ది సిలబస్!

samantha in green colour outfitసినీ ప్రేక్షకులంతా ‘రాధే శ్యామ్’ అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాలో గురువారం అర్ధరాత్రి నుండి నిరీక్షిస్తుంటే, ‘అవుట్ ఆఫ్ ది సిలబస్’ అన్న రీతిలో సమంత ప్రత్యక్షం అయ్యింది. ‘క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్’కు విచ్చేసిన సమంత అవుట్ ఫిట్ కు సోషల్ మీడియా అంతా ఫిదా అయ్యింది.

ఇంకేముంది… ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్ బుక్… ఇలా ఏ సోషల్ మీడియా ఏదైనా ఈ కుందనపు బొమ్మ ముఖచిత్రాలే దర్శనమిచ్చాయి. గ్రీన్ కలర్ అవుట్ ఫిట్ లో సమంత ప్రదర్శించిన అందాలు ‘రాధే శ్యామ్’ రిలీజ్ ను మించి నెట్టింట చర్చకు దారి తీశాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ADVERTISEMENT

చైతూతో బ్రేకప్ అయిన నాటి నుండి చాలా స్వతంత్రురాలిగా కనపడుతోన్న సమంత కాస్ట్యూమ్స్, మునుపటికి మించి హాట్ హాట్ గా ఉండడమే ఈ చర్చకు కారణమవుతోంది. సోషల్ మీడియాలో హీరోయిన్ల హాట్ పిక్స్ కు కొదవ ఉండవు, కానీ సమంత అంటే స్పెషల్ కదా… అన్న రీతిలో హల్చల్ చేస్తుంటాయి.

సమంత నటించిన ‘శాకుంతలం’ తెలుగు సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, ఇప్పటికే రెండు హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో పాటు మరికొన్ని బాలీవుడ్ వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ‘జెస్సీ’ దూకుడును చూస్తుంటే, రాబోయే కాలంలో మరిన్ని సెన్సేషన్స్ కు సిద్ధంగా ఉండమని ప్రేక్షకులకు సంకేతాలు ఇస్తున్నట్లే కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories