సమంత కోసం ఎగబడ్డారు!

samantha Launches V care Clinicసిల్వర్ స్క్రీన్ పై అందాలు ఆరబోసే ముద్దుగుమ్మలు పబ్లిక్ లోకి వస్తే ఉండే క్రేజ్ తెలియనిది కాదు. అలాంటిది అక్కినేని ఇంటి కోడలుగా ఉన్న సమంతకున్న ఫాలోయింగ్ సాధారణం కాదు. అలాంటి అనుభవమే నేడు హైదరాబాద్ లో చవిచూడాల్సి వచ్చింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వీ కేర్ క్లినిక్’ను ప్రారంభించడానికి విచ్చేసిన సమంతను చూసేందుకు అభిమానగణం ఉత్సాహం చూపింది.

అక్టోబర్ లో పెళ్లి కూతురు కాబోతున్న సమంతను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడడంతో… సమంత కారు లోపలికి రావడానికే ఇబ్బందిగా మారింది. అయితే ఫ్యాన్స్ హంగామాతో సదరు ప్రాంతమంతా కోలాహలంగా మారింది. కుందనపు బొమ్మ ‘జెస్సీ’ని తమ మొబైల్ కెమెరా కళ్ళల్లో బంధించేందుకు అభిమానులు పోటీపడ్డారు. టాప్ హీరోయిన్ గా సమంత క్రేజ్ ఏమిటో ఈ సందర్భంగా మరోసారి బయటపడింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories