టాలీవుడ్‌లో ట్రెండ్ మారింది. పండుగల సమయంలో తమ సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయాలనే పెద్ద హీరోల నిర్ణయంతో థియేటర్ల లభ్యత పెద్ద సమస్యగా మారింది. దీంతో వీలైనంత త్వరగా ‘రిలీజ్ డేట్’ను లాక్ చేసుకోవడంపై నిర్మాతలు దృష్టి కేంద్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఒక్కో సినిమా షూటింగ్ తుది దశలో విడుదల తేదేని ప్రకటిస్తుండగా, మరికొన్ని సినిమాలకు సెట్స్ పైకి వెళ్లకముందే విడుదల తేదీలను డిసైడ్ చేసుకుంటున్నాయి.
తాజాగా ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలు చేరాయి. జూనియర్ నటిస్తున్న తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’ ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాని ఆగస్ట్ 12న రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్లానింగ్ కూడా పక్కగా దర్శకుడు కొరటాల శివ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
అయితే, ఇదే తేదీకి రామ్ చరణ్ నటించబోయే ‘తని ఒరువన్’ రీమేక్ ను విడుదల చేయాలనీ భావిస్తున్నారని టాక్. మెగా వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు, ఈ మూవీని కూడా ఆగష్టు 12వ తేదీకి విడుదల చేయాలని అనుకుంటున్నారట. మరి ఇద్దరు ‘డీ’ కొడితే విజయం ఎవరిని వరిస్తుంది? మెగా క్యాంప్ నా? నందమూరి చిన్నోడినా? అన్నది ఇరువురు అభిమానుల మధ్య చర్చలకు దారితీసింది. మరో విశేషం ఏమిటంటే… ఈ రెండు సినిమాలు కూడా ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోకపోవడం!





