సూపర్ హిట్ గా డిక్లేర్ చేయొచ్చు!

Sammohanam-Collections‘భలే మంచి రోజు’ సినిమా తర్వాత సక్సెస్ కు దూరమైన సుధీర్ బాబుకు “సమ్మోహనం” రూపంలో బంపర్ హిట్ లభించినట్లే కనపడుతోంది. తొలి రోజుతో మొదలైన పాజిటివ్ టాక్ అలా వ్యాప్తి చెందుతుండడంతో బాక్సాఫీస్ వద్ద “సమ్మోహనం” మండే టెస్ట్ పాస్ అయినట్లే! దీంతో ‘సమ్మోహనం – సూపర్ హిట్’ అన్న ట్యాగ్ లైన్ ను ట్రేడ్ వర్గాలు వేసేస్తున్నాయి.

తొలి మూడు రోజుల తర్వాత సాధారణంగా కలెక్షన్స్ డల్ అవుతుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో నిలకడగా ఉండడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. స్థానికంగా ఇలా ఉంటే యుఎస్ బాక్సాఫీస్ వద్ద అయితే ‘సమ్మోహనం’కు బ్లాక్ బస్టర్ విజయం దక్కినట్లే! తొలి మూడు రోజుల్లో దాదాపుగా 4 లక్షల డాలర్స్ సొంతం చేసుకున్న ‘సమ్మోహనం,’ హాఫ్ మిలియన్ డాలర్స్ కేక్ వాక్ కాగా, ఆపై ఎంత తెస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories