పవన్ సినిమా డిస్ట్రిబ్యూటర్ అరెస్ట్!

Sampath Kumar - Sardar Gabbar Singh Distributor Arrestగతేడాది సమ్మర్ లో విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమాను కృష్ణాజిల్లాలో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. ‘సర్ధార్’ సినిమా ద్వారా తనకు నష్టం వచ్చిన 2 కోట్ల రూపాయలకు న్యాయం చేయాలంటూ, ఇటీవల ఫిల్మ్ చాంబర్లో నిరాహార దీక్షకు దిగిన విషయం సినీ విజ్ఞులకు తెలిసిందే. తన నష్టాన్ని ‘కాటమరాయుడు’ సినీ హక్కులను ఇచ్చి పూడ్చాలని కోరుతూ సదరు డిస్ట్రిబ్యూటర్ తన నిరసనను తెలియజేస్తున్నారు.

అయితే ఈ నిరాహార దీక్షలోకి కొందరు వ్యక్తులు చొరబడి సంపత్ కుమార్ ను బలవంతంగా బయటకు పంపారు. పవన్ కళ్యాణ్ మనుషులుగా చెప్పుకున్న వీరి ప్రభావంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సంపత్ కుమార్, అక్కడే నడిరోడ్డు మీదే పవన్ కు వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. తనకు న్యాయం జరిగే ఇక్కడే ఉంటానంటూ నినాదాలు చేస్తున్న సంపత్ ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మరో పక్కన మరికొద్ది గంటల్లో పవన్ తాజా చిత్రం ‘కాటమరాయుడు’ విడుదల కానున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT

అయితే ఇప్పటివరకు సంపత్ కుమార్ వివాదంపై పవన్ కళ్యాణ్ గానీ, మేనేజర్ శ్రీనివాస్ గానీ, నిర్మాత శరత్ మరార్ గానీ నోరు విప్పలేదు. ఇంతకీ సంపత్ నిరాహార దీక్షకు భగ్నం చేయడానికి వచ్చినదేవరు? ఆ వెంటనే సంపత్ ను పోలీసులు అరెస్ట్ చేయడమేంటి? దీని వెనుక ఎవరైనా అదృశ్య శక్తి హస్తం ఉందా? అన్న కోణాల్లో సినీ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే ఈ అంశం ఇక్కడితో ఆగిపోతుందా? లేక ‘కాటమరాయుడు’ విడుదల తర్వాత కూడా కొనసాగుతుందా? అనేది వేచిచూడాలి.

ADVERTISEMENT
Latest Stories