మోస్ట్ కాంట్రవర్షల్ దర్శకుడిగా మారిన వంగా..!

Sandeep Reddy Vanga

అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీలతో వివాదాల దర్శకుడిగా సందీప్ వంగా అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇటు సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ అయ్యారో ఇటు హిందీ వర్షన్ అర్జున్ రెడ్డి తో కలిపి తీసిన మూడు సినిమాలు విజయం సాధించడంతో సక్సెస్ ఫుల్ దర్శకుడుగా కూడా అంతే పాపులర్ అయ్యారు.

సందీప్ లేటెస్ట్ మూవీ అయిన యానిమల్ మూవీ రచ్చ, వంగా మీద కామెంట్స్ మూవీ విడుదలయ్యి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి. మొన్న బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు యానిమల్ మూవీ స్త్రీ ద్వేషాన్ని పెంచేలా ఉన్నాయంటూ చేసిన కామెంట్స్ కు సందీప్ అంతే ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.

ADVERTISEMENT

దీనికి కిరణ్ రావు నేను సందీప్ సినిమాలను చూడలేదు, కేవలం ఆయన సినిమాలలో స్త్రీ ద్వేషం పైనే నా అభిప్రాయాన్ని తెలియచేసాను అంటూ సందీప్ కామెంట్స్ కు రిప్లయ్ ఇచ్చారు. అలాగే కాంట్రావెర్సీ క్వీన్ కంగనా కూడా ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. యానిమల్ మూవీ మహిళల పై హింసను ప్రేరేపించేలా ఉంది అంటూ మూవీ పై నెగిటివ్ రివ్యూ ఇచ్చారు.

అయితే కంగనా ఒప్పుకుంటే తనతో సినిమా తీస్తా అంటూ సందీప్ వ్యాఖ్యానిస్తే, ఆ మూవీ దర్శకుడితో పనిచేసే ఉద్దేశం తనకు లేదంటూ నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు కంగనా. అయితే సందీప్ వివాదాలతో మొదలుపెట్టిన తన సినీ ప్రయాణాన్ని వివాదాలతోనే కొనసాగించడం ఎంతవరకు తన కెరియర్ కు ప్లస్ అవుతదో
ఆలోచించుకోవాలి.

యానిమల్ 2 అంతకు మించి ఉంటుంది అంటూ యానిమల్ 1 క్లైమాక్స్ లోనే హింట్ ఇచ్చిన సందీప్ ఇక ఆ సినిమా విడుదల తరువాత ఇంకెన్ని వివాదాలను ఎదుర్కుంటారో..? ఇంకెంత మందితో సున్నం పెట్టుకుంటారో..? చూడాలి మరి.

ADVERTISEMENT
Latest Stories