అర్జున్ రెడ్డి దర్శకుడి తరువాతి సినిమా వివరాలు

Director Sandeep Reddy Vangaటాలీవుడ్ లో సెన్సషనల్ హిట్ అందించిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో కూడా అదే సబ్జెక్టుతో కబీర్ సింగ్ పేరు భారీ హిట్ కొట్టాడు. ఆ తరువాత నుండి ఆయన తరువాతి ప్రాజెక్టు చర్చ నడుస్తూ ఉంది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ తో డెవిల్ అనే సినిమా చేస్తునట్టు ప్రకటించారు అయితే అది జరగలేదు.

ADVERTISEMENT

ఆ తరువాత అతను మహేష్ బాబు తో సినిమా చేస్తాడని… ప్రభాస్ తో చేస్తాడని ప్రచారం జరిగింది అయితే అదేమి కార్యరూపం దాల్చలేదు. చూస్తూ ఉండగానే కబీర్ సింగ్ విడుదలై ఏడాది దాటేసింది. దీనితో అతని అభిమానులు ఢీలా పడిపోయారు. అయితే తాజాగా తన తదుపరి చిత్రంపై సందీప్ రెడ్డి వంగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

“నా తదుపరి చిత్రం క్రైమ్ డ్రామా. స్క్రిప్ట్ దాదాపు పూర్తయింది. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. టి సిరీస్ ప్రధాన స్టూడియోగా వ్యవహరిస్తుంది కాని ఈ చిత్రాన్ని నా ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుంది,” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇందులో హీరో ఎవరు అనేది మాత్రం చెప్పలేదు ఆయన.

ఇది ఇలా ఉండగా.. అదే ఇంటర్వ్యూ లో సందీప్ మాట్లాడుతూ… “చిన్నప్పటి నుండీ చిరంజీవిని డైరెక్ట్ చెయ్యాలి అనేది నా కల. ఆయన వయసుకు సూట్ అయ్యే కథ ఒకటి నా దగ్గర ఉంది. తొందరలో ఆయనకు చెబుతా… అయితే ఆ సినిమా చేస్తారో లేదో అనేది మాత్రం తెలీదు,” అని చెప్పడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories