‘మున్నాభాయ్’ పక్కటెముక విరిగింది!

Sanjay Dutt Injured - Bhoomi Shooting Setsజైలు జీవితం నుండి బయటకు వచ్చిన తరువాత ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భూమి’ సినిమాలో సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరుగుతుండగా, యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో సంజయ్ దత్ గాయపడ్డాడు. అయినప్పటికీ, ఆ ఎపిసోడ్ మొత్తాన్ని పెయిన్ కిల్లర్స్ వాడి పూర్తి చేశాడు.

అయితే నొప్పి ఇంకా పెరిగిపోతూ ఇబ్బందికరంగా మారడంతో, ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా, సంజయ్ కు పక్కటెముక విరిగినట్టు తేలింది. దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో, కొన్నాళ్ళ పాటు షూటింగ్ కు విశ్రాంతినిచ్చారు. మళ్లీ ఈ నెలాఖరున సంజయ్ దత్ కోలుకున్న తరువాత షూటింగ్ ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories