మున్నాభాయ్ ఆగమనానికి ముహూర్తం ఖరారు!

sanjay dutt jail release1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడన్న నెపంతో అయిదేళ్ళ జైలు శిక్ష పడ్డ ‘మున్నాభాయ్’ సంజయ్ దత్ సత్ప్రవర్తన కారణంగా, శిక్షను తగ్గించడంతో గురువారం నుంచి బాహ్య ప్రపంచాన్ని చూడనున్నారు. ఉదయం 9 గంటల సమయంలో ఈ ‘ఖల్ నాయక్’ను విడుదల చేయనున్నామని జైలు అధికారి ప్రకటించారు.

ADVERTISEMENT

సంజయ్ కుటుంబ సభ్యులు గానీ, అభిమానులు గానీ ఘన స్వాగతం లాంటి చర్యలు ఏమీ చేయవద్దని జైలు అధికారులు భార్య మాన్యత తదితరులకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కావచ్చనే అంచనాతో భద్రతా కారణాల రీత్యా స్వాగతాలు వద్దని తెలిపినట్లు సమాచారం. పుణెలోని ఎరవాడ కేంద్ర కారాగారంలో ఉన్న సంజయ్ దత్ రెండు దఫాలుగా మొత్తం 50 నెలల పాటు జైలు జీవితం గడిపారు.

ADVERTISEMENT
Latest Stories