“సంజీవని” ట్రైలర్ – ఒక్క డైలాగ్ లేదు, అయినా అదిరిపోయింది!

sanjeevani-movieతెలుగు సినిమా కొత్త రూపు సంతరించుకుంటోంది. కొత్త తరం నటీనటుల రంగప్రవేశంతో పాటు, యువతరం సాంకేతిక నిపుణులు, ప్రతిభ గల దర్శకుల ఎంట్రీతో కొన్ని కొన్ని చిన్న చిత్రాల ట్రైలర్స్ అదిరిపోతున్నాయి. ఆ కోవలేనే తాజాగా విడుదలైన ఓ ట్రైలర్ వీక్షకులను అలరిస్తోంది.

ముక్కు మొహం తెలియని తారాగణంతో… ఒక్క డైలాగ్ కూడా లేని 81 సెకన్ల నిడివి గల “సంజీవని” ట్రైలర్ అదిరిపోయింది. హాలీవుడ్ సినిమా మాదిరి అడ్వెంచరస్ ఫీల్ కలిగిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఫోటోగ్రఫీ, లొకేషన్స్, శ్రవణ్ అందించిన నేపధ్య సంగీతం హైలైట్స్ గా ట్రైలర్ రూపొందింది. విడే రవి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనురాగ్ దేవ్, మనోజ్ చంద్ర, శ్వేత వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.

ADVERTISEMENT

2016 సమ్మర్ కానుకగా విడుదల కాబోయే ఈ సినిమా అడ్వెంచరస్ చిత్రాలను అమితంగా ఇష్టపడే సినీ ప్రియులను ఖచ్చితంగా అలరించేదిలా కనపడుతోంది. నివాస్ క్రియేషన్స్ పై జి.నివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిన్న చిత్రంగా కనపడుతున్నా ట్రైలర్ చూసిన తర్వాత ఇది చిన్న బడ్జెట్ చిత్రమంటే నమ్మశక్యం కాదు అని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT
Latest Stories