
దీంతో హాఫ్ సెంచరీనే అద్భుతం అనుకుంటే ఏకంగా సెంచరీతో చెలరేగిపోయాడు. డిండా, భటియా, జంపా వేసిన ఓవర్లలో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడిన శాంసన్ 62 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసిన తదుపరి బంతికే పెవిలియన్ చేరుకున్నాడు. అయితే అప్పటివరకు ఉన్న ఢిల్లీ స్కోర్ బోర్డు పరిస్థితి వేరు. శాంసన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ మోరిసన్ సృష్టించిన అరాచకంతో, ఢిల్లీ ఏకంగా 205 పరుగులను నమోదు చేసి, పూణే ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
నిజానికి శాంసన్ ఔతయ్యే సమయానికి స్కోర్ బోర్డు 18.2 బంతుల్లో 166 పరుగులు మాత్రమే. ఇన్నింగ్స్ ముగియడానికి ఇంకా 10 బంతులు ఉండగా, అందులో 9 బంతులను ఎదుర్కొన్న మోరిసన్ 4 బంతులను ఫోర్లకు, 3 బంతులను సిక్సర్లకు తరలించి, ఆ 9 బంతుల్లో ఏకంగా 38 పరుగులు చేసాడు. దీంతో ఢిల్లీ ఇన్నింగ్స్ చివరి 10 బంతుల్లో 39 పరుగులు వచ్చాయి. అలాగే చివరి 4 ఓవర్లలో 76 పరుగులు చేసింది. ముంబైపై 180 పరుగులను చేధించిన పూణే, మరి 205 పరుగులను ఎలా చేధిస్తుందో చూడాలి.
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…