2016 సంక్రాంతి ‘విజేత’ – ఫలితాలు విడుదల!

sankranthi 2016 telugu cinema winnerగత కొన్ని సంవత్సరాలుగా పండుగల సమయంలో కేవలం ఒకటి, రెండు చిత్రాలే విడుదల కానుండడంతో, ఈ సంక్రాంతి నాలుగు సినిమాల విడుదలలు హాట్ టాపిక్ గా మారాయి. బరిలోకి దిగిన నాలుగు చిత్రాలు నాలుగు జోనర్స్ లో నిలవడం ప్రేక్షకులకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “సోగ్గాడే చిన్నినాయనా” సినిమాతో నాలుగు సినిమాలు విడుదలై, ప్రేక్షకుల తీర్పును అందుకున్నాయి.

ఈ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు కలెక్షన్స్ సాధిస్తాయి అనేది పక్కన పెడితే, పబ్లిక్ టాక్ రీత్యా టాక్ ఏ చిత్రం హిట్టు, ఏ చిత్రం ఫట్టు అన్నది ప్రామాణికంగా మారింది. తొలి రోజున విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” ఎ సెంటర్ల వరకు పరిమితమైంది. రెండవ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ “డిక్టేటర్” బి, సి సెంటర్లలో సందడి చేస్తోంది. అలాగే ఇదే రోజున విడుదలైన శర్వానంద్ “ఎక్స్ ప్రెస్ రాజా” సినిమాకు ఆడియన్స్ పాజిటివ్ టాక్ ఇచ్చారు.

ADVERTISEMENT

ఇక, నేడు విడుదలైన “సోగ్గాడు చిన్నినాయనా” సినిమాతో సంక్రాంతి “విజేత” నిర్ణయమైంది. విడుదలైన అన్ని చిత్రాలలో ప్రేక్షకుల చేత పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాగా “సోగ్గాడే చిన్నినాయనా” నిలబడింది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ధియేటర్లలో వినోదాన్ని పంచుతున్న నాగ్, చివరిగా వచ్చినా, పండగ విజేతగా నిలిచి సత్తా చాటాడు. ప్రేక్షకుల చేత అందుకున్న టాక్ ను బట్టి ఈ నాలుగు సినిమాల వరుస క్రమాన్ని పరిశీలిస్తే…
మొదటి స్థానం – సోగ్గాడే చిన్నినాయనా
రెండు – ఎక్స్ ప్రెస్ రాజా
మూడు – నాన్నకు ప్రేమతో
నాలుగు – డిక్టేటర్
అయితే కలెక్షన్స్ ను ప్రామాణికంగా తీసుకుంటే ఈ నాలుగు సినిమాల క్రమం వేరుగా ఉంటుంది కానీ, పబ్లిక్ టాక్ రీత్యా అయితే 2016 సంక్రాంతి “విజేత” అక్కినేని నాగార్జునేనని సినీ విమర్శకులు తేల్చేసారు. దీంతో అక్కినేని అభిమానులంతా ప్రస్తుతం… ‘టిక్క టిక్క డుం డుం… టిక్క టిక్క డుం డుం…’ అంటూ పాటలు పాడుకుంటూ ‘వాసివాడి తస్సాదియ్యా…’ అంటూ డిఫరెంట్ మాడ్యుల్స్ లో డైలాగ్స్ చెప్పుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories