స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,మ్యాజికల్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అల…వైకుంఠపురములో షూటింగ్ వేగంగా జరుగుతుంది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేస్తాం అని మొదటి నుండీ చెబుతున్నారు. జనవరి 12, 2020 న విడుదల తేదీగా నిర్ణయించినట్టు తెలుస్తుంది.
జనవరి 12, 2020 అంటే ఆదివారం. కాకపోతే ఆ తరువాత భోగి, సంక్రాంతి, కనుమ సెలవులు వెంటవెంటనే రావడంతో జనవరి 12, 2020 నే బెస్ట్ అని నిర్మాతలు భావిస్తున్నారట. మరోవైపు జనవరి 11న సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు విడుదల అవుతుంది. రజినీకాంత్ దర్బార్, కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా, శర్వానంద్ శ్రీకారం కూడా సంక్రాంతికే విడుదల అవుతున్నాయి.
వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
చాలా కాలం తరువాత టబూ ఈ సినిమాతో తిరిగి తెలుగులో నటిస్తుంది టబూ. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి హిట్ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తన గత చిత్రం నా పేరు సూర్య పెద్ద ప్లాప్ కావడంతో బన్నీ షాక్ తిన్నాడు. ఆ తరువాత తన తరువాతి సినిమా మొదలు పెట్టడానికి ఏడాది వెయిట్ చెయ్యాల్సి వచ్చింది. దానితో అల వైకుంఠపురములో.. సినిమాతో పెద్ద హిట్ కొట్టడానికి బన్నీ కృతనిశ్చయంతో ఉన్నాడు.





