సర్కారు వారి పాట… ఇది రెండోసారి..!

Sarakaru vaari paata song leak మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న అన్ని సినిమాలకు సంబంధించి గతేడాది కాలంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు గురవుతున్నారు. ‘పుష్ప’ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో, ‘సర్కార్ వారి పాట’కు సంబంధించి మహేష్ అభిమానులతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం కూడా అదే పంథాలో కొనసాగుతోంది.

తాజాగా మరోసారి ‘సర్కార్ వారి పాట’ లీకుతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుండి భారీ స్థాయిలో ట్రోలింగ్ ను ఎదుర్కొంది. ఈ నెల 14వ తేదీన విడుదల కావాల్సిన లిరికల్ సాంగ్ ముందే లీక్ కావడంతో, హర్ట్ అయిన అభిమానులు మళ్ళీ నిర్మాణ సంస్థను టార్గెట్ చేస్తూ హల్చల్ చేసారు. గతంలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ కావాల్సిన టీజర్ కూడా లీక్ కావడంతో, దానిని అర్ధరాత్రే విడుదల చేసిన వైనం తెలియనిది కాదు.

ADVERTISEMENT

దీంతో తాజాగా ఈ లిరికల్ సాంగ్ ను కూడా ఆదివారం సాయంత్రం 4.05 నిముషాలకు విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన చేసారు. ఈ లీక్ కు సంబంధించి ఓ ఇద్దరు వ్యక్తులను గుర్తించిన నిర్మాతలు జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. అయితే ఈ చర్యలేవో గతంలోనే టీజర్ లీక్ అయినప్పుడే తీసుకున్నట్లయితే, నేడు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా అన్నది అభిమానుల భావన.

ఈ లీక్ పై సంగీత దర్శకుడు థమన్ కూడా తీవ్రంగా కలత చెందుతూ పోస్ట్ లు చేసారు. విశేషం ఏమిటంటే… “సర్కార్ వారి పాట”కు సంబంధించి ఇప్పటివరకు రెండు వీడియోలను మాత్రమే అధికారికంగా విడుదల చేయగా, ఆ రెండూ కూడా లీకుల బారిన పడి, ముందుగానే ప్రేక్షకుల దరికి చేరుతున్నాయి. ఇప్పటికైనా లీకులు కాకుండా చిత్ర నిర్మాణ సంస్థ పలు జాగ్రత్తలు వహిస్తుందని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories