40 సెకన్ల ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ టీజర్ టాక్!

Sardaar gabbar singh 40 seconds teaserపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమాకు సంబంధించి ఇప్పటికీ మూడు వీడియోలు విడుదలయ్యాయి. మొదటి రెండు టీజర్లు దాదాపుగా ఒకే విధంగా ఉండగా, ఇటీవలే మేకింగ్ వీడియోను విడుదల చేసి ‘సర్ధార్’ సందడిని షురూ చేసారు. అయితే అసలు సిసలు కమర్షియల్ టీజర్ ఈ గురువారం నాడు తెలుగు, హిందీ భాషలలో ప్రేక్షకులను పలకరించనుంది.

అయితే ఇప్పటికే ఈ టీజర్ ను వీక్షించిన పలువురు సినీ వర్గీయులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలిపారు. టైటిల్ సాంగ్ తో కూడిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పవర్ స్టార్ ను అధ్బుతమైన యాంగిల్స్ లో చూపిస్తూ, 40 సెకన్ల టీజర్ ను కట్ చేసినట్లుగా చెప్తున్నారు. ఈ సమాచారం వింటున్న పవన్ అభిమానులు మాత్రం, టీజర్ ను ఎప్పుడెప్పుడు చూసేయ్యాలా అనే విధంగా కాచుకుని కూర్చున్నారు. ఈ టాక్ పవన్ ఫ్యాన్స్ లో టీజర్ పట్ల మరింత ఉత్సుకతను రేపుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories