“సర్దార్”లో చాలా “హైలైట్స్” ఉన్నాయి!

Sardaar Gabbar Singhఏప్రిల్ 8వ తేదీన విడుదలకు ముస్తాబవుతున్న “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఎన్నో వింతలు, విశేషాలు ఉండనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎలాగైనా అనుకున్న సమయానికి విడుదల చేయడానికి రెండు, మూడు చిత్ర యూనిట్లతో షూటింగ్ జరుపుతుండగా, ఈ సినిమాలో రెండు ఐటెం సాంగ్స్ ను రూపకల్పన చేసారు.

ఇక, సినిమాలో కోట్లాది రూపాయలతో హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్ తప్ప పెద్దగా ఇతర వార్తలు బయటకు రాలేదు. అయితే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుందని, అలాగే సెకండాఫ్ లో వచ్చే ‘జబర్దస్త్’ కామెడీ ఒక రేంజ్ లో ఉండబోతుందని, పవన్ డైలాగులు, స్టెప్పులు అన్ని అభిమానులను అలరించే విధంగా ఉంటాయని హాబీ ఇచ్చారు.

ADVERTISEMENT

ఇక, మూవీలో అసలు హైలైట్ సన్నివేశం… “హార్స్ మేళా సందర్భంగా చిత్రీకరించిన సీన్” అవుతుందని యూనిట్ వర్గాల సమాచారం. ఈ మేళా కోసం 1000 మంది యూనిట్ సభ్యులు 3 టీమ్‌లుగా ఏర్పడి ఏక కాలంలో షూటింగ్ పూర్తి చేయడం విశేషం. 100 గుర్రాలు, హార్స్ రైడర్స్, రకరకాల కంపెనీలకు చెందిన ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులతో ఈ సన్నివేశం అదిరిపోయిందని టాక్. అలాగే 10 వింటేజ్ మరియు లగ్జరీ కార్లు వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా ‘రత్నాపూర్ కా సర్ధార్’ సత్తా ఏమిటో చాటి చెప్పాలని అభిమానులు ఊర్రూతలూగుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories