బైక్ పై “సర్ధార్ గబ్బర్ సింగ్” స్టిల్ అదుర్స్!

sardar gabbar singh pawan kalyan new still పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆన్ సెట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బైక్ లంటే అమితంగా ఇష్టపడే పవన్ కళ్యాణ్ పచ్చ కలర్ బైక్ పై దూసుకెళ్తున్న స్టిల్ పవర్ స్టార్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహానికి కారణమైంది.

కళ్ళకు గాగుల్స్, మెడలో టీ షర్టు వేసుకుని పవన్ నడుపుతున్న తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఈ ఫోటోను షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో టెంట్ మరియు షూటింగ్ వ్యాన్ ఉండడంతో బహుశా చిత్రీకరణ విరామంలో పవన్ సరదాగా బైక్ పై చక్కర్లు కొట్టి ఉంటారేమోనని అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

ADVERTISEMENT

బైక్ ల పవన్ కుండే మోజు అభిమానులకు తెలియనిది కాదు. పవన్ గత చిత్రం “గోపాల గోపాల” కోసం ప్రత్యేకంగా ఓ బైక్ ను రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం పవన్ డ్రైవ్ చేస్తున్న బైక్ పేరు స్పష్టంగా కనపడడం లేదు గానీ, ఈ కలర్ బైక్ లు మార్కెట్ లో బహు అరుదుగా ఉంటాయి. సినిమా విడుదలైతే గానీ తెలియదు పవన్ సృష్టించే హంగామా ఏమిటో..!

ADVERTISEMENT
Latest Stories