మహర్షి సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్న మహేష్

Sarileru Neekevvaru Pre Release event on 5th Jannuary 2020సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం మైండ్ బ్లాక్ పాట అన్నపూర్ణ స్టూడియోస్ లో షూట్ చేస్తున్నారు. ఈ పాట తరువాత కేవలం రెండు మూడు రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంటుంది. సరిలేరు నీకెవ్వరూ సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇది ఇలా ఉండగా జనవరి 5న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగబోతుంది. ఎల్బీ స్టేడియం ను బుక్ చేశారు. గతంలో మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరిగింది. మహర్షి మహేష్ బాబు కేరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్, దానితో సెంటిమెంట్ గా దానినే వేదికగా నిర్ణయించారు ఈ సారి కూడా.

ADVERTISEMENT

అయితే మహర్షితో అందుకోలేకపోయిన 100 కోట్ల షేర్ ఈ సినిమాతో అందుకుంటారో లేదో చూడాలి. సినిమాలో మహేష్ బాబు తొలిసారిగా ఆర్మీ మేజర్ గా కనిపించనున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 వంటి అతిపెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.

వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అనిల్ కృతనిశ్చయంతో ఉన్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన మొట్టమొదటి సారిగా రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. రేపు సినిమా నుండి మరో పాట విడుదల చెయ్యబోతుంది సినీ బృందం.

ADVERTISEMENT
Latest Stories