స్పైడర్’ మాదిరే… పోస్టర్లు కుమ్మేస్తున్నాడు..!

Sarkar-Poster---Vijay---AR-Murugadossప్రిన్స్ మహేష్ బాబుతో తెరకెక్కించిన “స్పైడర్” ఫలితాన్ని పక్కన పెడితే, ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా పోస్టర్లను విడుదల చేయడంలో దర్శకుడు మురుగదాస్ సక్సెస్ సాధించారు. మహేష్ ను చాలా అందంగా, స్టైలిష్ గా ప్రజెంట్ చేసిన మురుగ, సినిమాను మాత్రం దారుణంగా తెరకెక్కించి ప్రిన్స్ అభిమానులతో పాటు, ట్రేడ్ వర్గాలను కూడా నిరుత్సాహపరిచాడు.

ప్రస్తుతం విజయ్ తెరకెక్కిస్తోన్న సినిమా “సర్కార్” ఫలితం ఎలా ఉంటుందో గానీ, ఈ సినిమా పోస్టర్లు కూడా కుమ్మేస్తున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ను సిగరెట్ తాగుతూ విడుదల చేసిన మురుగ, తాజాగా ఆడియో రిలీజ్ పోస్టర్ ను ఎంతో స్టైలిష్ గా సూటు, బూటుతో వదిలారు. అక్టోబర్ 2 నుండి ఆడియో అందుబాటులోకి వస్తుందంటూ రిలీజ్ చేసిన “సర్కార్” పోస్టర్, విజయ్ అభిమానులకు ఐ ఫీస్ట్ గా మారింది.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories