మెగాస్టార్ ఏమో గానీ, ఫ్యాన్స్ అదే చేస్తారు!

SEETI MAAR Song Trailer - DJ Video Songsమరో నాలుగు రోజుల్లో ధియేటర్స్ లో ప్రత్యక్షం కానున్న అల్లు అర్జున్ “దువ్వాడ జగన్నాధమ్” ప్రమోషన్స్ పతాక స్థాయికి చేరుకున్నాయి. అందులో భాగంగా తాజాగా ‘సీటి మార్’ అనే వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆడియోలో విన్నప్పుడే ఇది బన్నీకి తగిన మాంచి డ్యాన్సింగ్ బీట్ అన్న విషయం స్పష్టం కాగా, తాజాగా విడుదల చేసిన వీడియో దానిని ధృవీకరించింది.

అయితే ఈ పాటలో ఉన్న మరో స్పెషాలిటీ ఏమిటంటే… సాధారణంగా ఇలాంటి డ్యాన్సింగ్ బీట్స్ లో బన్నీ తన విశ్వరూపం చూపిస్తాడు. కానీ ఇందులో బన్నీతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే కూడా అదిరిపోయేలా డ్యాన్స్ చేసిందన్న విషయం స్పష్టమైంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో ‘ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్’ అంటూ బన్నీ ఆలపిస్తూ ఇరగదీసే స్టెప్పులు వేసాడు.

ADVERTISEMENT

అనంతలోకాలలో ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్ ఈ బన్నీ స్టెప్పులను చూడడం అసాధ్యం. ఇక ఇలాంటి డ్యాన్స్ లను పరిచయం చేసిన మెగాస్టార్ కూడా విజిల్ వేస్తారో లేదో గానీ, ధియేటర్స్ లో ఫ్యాన్స్ మాత్రం విజిల్స్ వేస్తూనే ఉంటారనే విధంగా బన్నీ కేక పుట్టించాడు. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటల కొరియోగ్రఫీ వీక్షించడానికి అద్భుతంగా ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories