సీనియర్ నటిమణి అన్నపూర్ణ కూతురు సూసైడ్!

Senior Actress Annapurna Daughter Suicideఒకప్పుడు అమ్మ పాత్రలకు కేరాఫ్ అడ్రస్… ప్రస్తుతం భామ్మ పాత్రలను విజయవంతంగా పోషిస్తూ… టాలీవుడ్ తెరపై నవ్వులు పూయిస్తోన్న సీనియర్ నటిమణి అన్నపూర్ణ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కూతురు కీర్తి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో, అన్నపూర్ణకు ఎక్కడలేని కష్టం వచ్చిపడింది.

[m9ad]

ADVERTISEMENT

కొన్నేళ్ళ క్రితం బెంగుళూరుకు చెందిన ఓ సాయి అనే సాఫ్ట్ ఇంజినీర్ తో కీర్తినిచ్చి వివాహం చేయగా, గత కొంతకాలంగా భర్తతో ఉన విభేదాల రీత్యా వేరుగా ఉంటూ హైదరాబాద్ లోనే నివాసం ఉంటోంది. అయితే కీర్తి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందు వలనే ఆత్మహత్య చేస్తున్నట్లుగా పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.

కీర్తి మొబైల్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఏమైనా సమాచారం లభిస్తుందేమోనని విచారణ చేస్తున్నారు. ఇవాళ విడుదలైన “హ్యాపీ వెడ్డింగ్” సినిమాలో అన్నపూర్ణ ఓ కీలక పాత్రలో కనిపించి నవ్వించే ప్రయత్నం చేసింది. అలాంటి సీనియర్ నటిమణి ఇంట్లో విషాదంపై టాలీవుడ్ వర్గాలు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories