ట్రైలర్ టాక్ – కింగ్ ‘ఫ్యాన్స్’కు పండుగే!

Shah Rukh Khan Fan trailer talkకింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం “ఫ్యాన్.” ఇప్పటికే ఏర్పడిన భారీ అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్ళింది తాజాగా విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్. హీరో పాత్రలోనూ, అభిమాని పాత్రలోనూ డ్యూయల్ రోల్ పోషించిన షారుక్, వెండితెరపై విజ్రుభించడం ఖాయంగా కనపడుతోంది. ఈ ట్రైలర్ లో మరో హైలైట్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా అద్భుతంగా సాగింది.

“తన అభిమాన హీరోను కలవడానికి ఒక అభిమాని ఎలాంటి ప్రయత్నం చేసాడు, కలిసిన తర్వాత ఆ హీరో ఏమన్నాడు, దానికి అభిమాని ఎలా స్పందించి ఆ హీరోను తన వెంట పడేలా చేసాడు” అనేది క్లుప్తంగా ఈ సినిమా కధ. దీనిని వెండితెరపై వీక్షించడానికి ప్రతి అభిమాని ఏప్రిల్ 15వ తేదీకి సిద్ధం కావడమే ఆలస్యం మరి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories