వయసైపోయే హీరోలు రాజుగారి ఏనుగులు

Shahrukh Khan Pathaan Movieరాజుగారి ఏనుగు చచ్చినా బ్రతికినా ఒకటే వైభవం అని పెద్దలు ఊరికే అనలేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఇది అక్షరాలా వర్తిస్తుంది. షారుఖ్ ఖాన్ కొత్త సినిమా పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్ దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇంకా వారం ఉండగానే పది కోట్లకు దగ్గరిగా వెళ్లిపోవడం మాములు విషయం కాదు. వరస డిజాస్టర్ల తర్వాత నాలుగేళ్ళ గ్యాప్ తీసుకున్న ఒక సీనియర్ నటుడి కోసం జనం ఇంతగా తాపత్రయపడుతున్నారంటే అతను ఏర్పరుచుకున్న ఫ్యాన్ బేస్ తాలూకు బలం అది. ఇది పెరిగేదే కానీ తరిగేది కాదు.

ఊరికే ఎవరూ లెజెండరీలు అయిపోరు. పనైపోయిందనుకున్న ప్రతిసారి కిందపడి లేవడం ఎంత బలంగా ఉంటుందంటే బాక్సాఫీస్ సైతం నివ్వెరపోతుంది. మన దగ్గరా ఉదాహరణలు ఉన్నాయి. 1995 టైంలో ఫ్లాపు మీద ఫ్లాపు దెబ్బ కొట్టినప్పుడు చిరంజీవి ఏడాది గ్యాప్ తీసుకుని హిట్లర్ తో సాలిడ్ కంబ్యాక్ కు ఎవరికీ నోటమాట రాలేదు. ఆచార్య తర్వాత ఇలాంటి కామెంట్స్ వస్తే ఇప్పుడు సమాధానం వాల్తేరు వీరయ్య రూపంలో దొరికింది. అఖండ బ్లాక్ బస్టర్ కు ముందు బాలకృష్ణ ఖాతాలో వరసగా మూడు డిజాస్టర్లున్నాయి. కట్ చేస్తే అన్ స్టాపబుల్, వీరసింహారెడ్డి ఇలా దూసుకుపోవడమే

ADVERTISEMENT

ఇది చరిత్ర ఎన్నోసార్లు ఋజువు చేస్తూ వస్తున్నదే. 1990 టైంలో నటుడిగా ఎన్టీఆర్ ని జనం రిసీవ్ చేసుకోవడం లేదన్న అప్పటి మీడియా కథనాలకు మేజర్ చంద్రకాంత్ ఇచ్చిన సమాధానం ఇప్పటికీ మారుమ్రోగుతుంది. విగ్గు లేకుండా ఎవరు చూస్తారని నవ్విన వాళ్లకు ఏఎన్ఆర్ సీతారామయ్య గారి మనవరాలు రూపంలో అలా అనేసిన నోళ్ళను సిల్వర్ జూబ్లీతో కొట్టారు. చిరు బాలయ్య ట్రెండ్ లో పోటీ పడలేకపోతున్నారన్న ఎగతాళికి సూపర్ స్టార్ కృష్ణ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి ద్వారా చెప్పిన సూపర్ హిట్ ఆన్సర్ నెంబర్ వన్.

ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. అశేషమైన ఫాలోయింగ్ తో ఒక స్థాయికి చేరాక సీనియర్లు సొంతం చేసుకున్న అభిమానాన్ని తరిగించడం ఎవరి వల్లా కాదు. షారుఖ్ రేపు పఠాన్ తో హిట్టు కొట్టొచ్చు లేకపోవచ్చు. ఒకవేళ తేడా కొడితే మళ్ళీ జవాన్ కి ఇదే సీన్ రిపీట్ అవుతుంది. భోళా శంకర్ కి, బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమాలకు సంక్రాంతి అంత కాకపోయినా ఇంచుమించు ఇదే సందడి అప్పుడూ చూడొచ్చు. భవిష్యత్తులో ప్రభాస్ పవన్ మహేష్ చరణ్ తారక్ బన్నీ ఈ స్థాయి పీక్స్ ని లేట్ ఏజ్ లో చూస్తారో లేదో కానీ సీనియర్లు మాత్రం ఏజ్ తో సంబంధం లేకుండా జై కొట్టించుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories