బెస్ట్ ఆఫ్ త్రీ – కమర్షియల్ గా చైతూనే!

Shailaja-Reddy-Alludu-Latest-Updatesవినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 13వ తేదీన టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద “శైలజారెడ్డి అల్లుడు, యూ టర్న్, నన్ను దోచుకొందువటే” మూడు సినిమాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలలో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే సినిమాగా ఎక్కువ అవకాశాలు “శైలజా రెడ్డి అల్లుడు”కు ఉన్నాయని ఈ సినిమా ట్రైలర్ కు లభిస్తోన్న స్పందన చెప్తోంది.

[m9ad]

ADVERTISEMENT

పాయింట్ పాతదే అయినా మారుతీ బ్రాండ్ కామెడీ టైమింగ్ తో ఈ రోజు ఉదయం విడుదలైన ట్రైలర్ కు వీక్షకుల నుండి మంచి స్పందన లభించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘యూ టర్న్’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ, అది ఒక జోనర్ కు చెందిన మూవీగా నిలుస్తోంది. ఇక సుధీర్ బాబు నటించిన “నన్ను దోచుకొందువటే” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు గానీ, ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

అయితే ‘శైలజారెడ్డి అల్లుడు’ ట్రైలర్ లో వినోదం పాళ్ళు ఎక్కువగా ఉండడం, సరికొత్తగా చైతూ కనిపిస్తుండడం, ‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు’ దర్శకుడు మారుతీ బ్రాండ్ ఉండడంతో… ఈ మూడింటిలో రేసులో చైతూ మూవీ ముందుంది. చివరి నిముషంలో సుధీర్ బాబు సినిమా డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వస్తున్నప్పటికీ, ఈ సినిమా రిలీజ్ డేట్ ను నిర్మాత అయిన సుధీర్ బాబు ఇప్పటికే అధికారికంగా ధృవీకరించారు.

ADVERTISEMENT
Latest Stories