గోవాలో చైతూ రొమాన్స్!

Shailaja Reddy Alludu movie song shooting in Goaఈ నెల 31వ తేదీన “శైలజా రెడ్డి అల్లుడు” రూపంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాగచైతన్య, ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి పాట చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. గోవాలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ పాట పూర్తి స్థాయి రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కుతోంది. చైతూ – అను ఇమ్మానుయెల్ మధ్య చిత్రీకరిస్తోన్న ఈ పాట స్టిల్స్ ప్రస్తుతం నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. విశేషం ఏమిటంటే… చైతూ – అనుల మధ్య చిత్రీకరిస్తోన్న షూటింగ్ స్పాట్ గోవాలోనే చైతూ సతీమణి సమంత కూడా ఉంది. ఇటీవలే తానూ గోవాలో ఉన్నట్లుగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన హాట్ పిక్స్ సంగతి తెలిసిందే. మొత్తానికి సతీమణి ఆధ్వర్యంలోనే చైతూ రొమాంటిక్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకోబోతున్నాడన్న మాట.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories