టీజర్ టాక్ – మణి ఈజ్ బ్యాక్!

shamantakamani-official-teaser-talkసుధీర్ బాబు, నారా రోహిత్, సందీప్ కిషన్, ఆది వంటి నలుగురు యువ హీరోలతో పాటు నటకిరీటీ రాజేంద్రప్రసాద్ వంటి సీనియర్ హీరో కీలక పాత్ర పోషిస్తున్న “శమంతకమణి” సినిమాకు సంబంధించి ఇటీవల పాత్రల పరిచయాలతో కూడిన పోస్టర్లను విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తి పెంచారు. ఇక పోస్టర్ల నుండి వీడియో రేంజ్ వచ్చిన ఈ పబ్లిసిటీలో భాగంగా తొలి టీజర్ విడుదలైంది. ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతమే హైలైట్ గా టీజర్ కు వీక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.

నలుగురి హీరోల లుక్స్ ను చూపిస్తూ… చివర్లో ‘శమంతకమణా… ఆమెడెవరు సార్…’ అన్న రాజేంద్రప్రసాద్ వేసిన డైలాగ్ తో ఓ నవ్వు నవ్వించింది టీజర్. బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించడంలో మణిశర్మ దిట్ట అని ఎందుకు సంగీత ప్రియులు అంటారో అన్న దానికి నిదర్శనంగా ఈ టీజర్ నిలుస్తోంది. అలాగే సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ కూడా అదిరిపోయే రేంజ్ లోనే ఉంది. చూడబోతుంటే… ‘భలే మంచి రోజు’ తర్వాత దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఖాతాలో ‘శమంతకమణి’ రూపంలో మరో హిట్ చేరేలా కనపడుతోంది. మరి మీరు ఓ లుక్కేయండి..!

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories