షర్మిలకు మళ్ళీ మండినట్టుందిగా..!

రాష్ట్రంలో వైసీపీ కి వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తిన దానికి చంద్రబాబు నాయుడే బాధ్యుడు అంటూ చిలక పలుకులు పలుకుతారు వైసీపీ నాయకులు. అయితే రాష్ట్రంలో ఏమూల ఏ అరాచక చర్య జరిగిన దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అంటూ గాండ్రిస్తారు షర్మిల. పోలింగ్ రోజు నుండి సైలెంట్ అయిన షర్మిల తన అన్న పై మళ్ళీ వైలెంట్ గా మారిపోయింది.

ఎన్నికల తంతు పూర్తి చేసుకుని కుటుంబంతో కలిసి అతి పేదవాడైన జగన్ అత్యంత ఖరీదైన విమానంలో విహార యాత్రకు వెళితే దాన్ని కూడా తప్పుబడుతున్నారు షర్మిల. ఏలూరు జిల్లాలో పదోతరగతి విద్యార్థి మీద జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ రాష్ట్రంలో ఇంత అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటుంటే జగన్ మాత్రం, ఓట్లేసిన మహిళల ఆర్తనాదాలు, హాహాకారాలు పట్టించుకోకుండా లండన్ విధులలో విహార యాత్రలు చేయడం సిగ్గుచేటు అంటూ ఇక అన్న పై విమర్శల దాడి మళ్ళీ మొదలుపెట్టారు షర్మిల.

ADVERTISEMENT

లండన్ వీధుల్లో పొర్లుదండాల మధ్య విహరిస్తున్న మీకు, ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు వినపడవు అంటూ లండన్ లో రోడ్ మీద పడి జగన్ కి దండం పెడ్తూ అతి చేసిన జగన్ ఫ్యాన్ కి కూడా గడ్డి పెట్టేసారు షర్మిల.

ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు నా తల్లుల్లు, నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వలు అంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన జగన్ వి అన్ని ఫేక్ ప్రేమలు అంటూ తేల్చేసారు షర్మిల. వైసీపీ పాలన మహిళా భద్రతకు, బ్రతుకులకు పట్టిన చీడవంటిది అని దేశం మొత్తం మాట్లాడుతుంది, దీనికి మీ నాయకులు, మంత్రులు అందరు సిగ్గుపడాలన్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ పై ఒంటికాలు మీద లేచిన షర్మిల ఈ మధ్యకాలంలో కాస్త గ్యాప్ ఇచ్చింది.

దీనితో కాస్త ఊపిరి తీసుకున్నారు జగన్ అండ్ కో. అయితే ఇక మొదలెడదాం అంటూ షర్మిల మళ్ళీ తన ఆట మొదలు పెట్టడంతో వైసీపీ నాయకులలో భయం మొదలయ్యింది. ఇప్పుడే షర్మిల ఈ విధంగా జగన్ ను ఆడుకుంటుంటే ఇక జూన్ 4 తరువాత వైసీపీ కి వ్యతిరేకంగా ఫలితాలు వెలువడితే ఇక జగన్ పరిస్థితి ఊహించుకోవడం కూడా కష్టమే అంటూ ఆందోళన చెందుతున్నారు వైస్సార్ అభిమానులు.

అగ్గికి వాయువు తోడయినట్లు కూటమి నేతలకు షర్మిల విమర్శలు జత కలిస్తే జగన్ కు ఎక్కడో మండడం ఖాయమే అవుతుంది సుమీ..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Daily Hearing At CBI Court, But Can Jagan Stay Out?

It has been more than dedicate since the CBI and the enforcement directorate have failed,…

6 minutes ago

వివేకా హత్య కేసులో సీబీఐ కంటే ఈడీ స్పీడ్‌!

“వివేకా హత్య కేసుతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఆ ఆరోపణలతో నేను చాలా ఆవేదన అనుభవిస్తున్నాను. నేను ఏ…

11 minutes ago