నిర్వాణ తన మార్క్ నమోదు చేసుకోగలడా?

Shiva Nirvana’s Irumbudi: Can It Be a Hit?

2017లో టాలీవుడ్ కి “నిన్ను కోరి” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శివ నిర్వాణ, ఇప్పటివరకు నాలుగు సినిమాలు తీశాడు. “నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్, ఖుషీ”, వీటిలో నిన్నుకోరి, మజిలీ మంచి హిట్ సినిమాలుగా నిలవగా.. టక్ జగదీశ్ ఓటీటీ రిలీజ్ అయినా, ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఇక “ఖుషీ” ఫ్లాప్ గా నిలిచింది.

హిట్టు, ఫ్లాప్ పక్కన పెడితే.. తన మొదటి రెండు సినిమాల విషయంలో మణిరత్నం ఫార్మాట్ ని ఫాలో అవ్వడం, మాస్ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నంగా తెరకెక్కించిన టక్ జగదీష్ వర్కవుట్ అవ్వకపోవడం, ఖుషీ ఫ్లాప్ అవ్వడంతో.. దర్శకుడిగా శివ నిర్వాణ ఇప్పటివరకు తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకోలేకపోయాడు.

ADVERTISEMENT

అయితే.. తన మునుపటి సినిమాలన్నిటికంటే “ఇరుముడి” విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు శివ నిర్వాణ. ఎన్నడూ లేని విధంగా భారీ స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నాడు. ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా అని, రవితేజ పీక్ పెర్ఫార్మెన్స్ అని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు శివ నిర్వాణ.

అందుకు కారణం లేకపోలేదు. నాని, నాగచైతన్య, విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలతో వర్క్ చేసిన శివ నిర్వాణ మొదటిసారి ఒక సీనియర్ స్టార్ హీరోతో వర్క్ చేస్తున్నాడు. తన కంఫర్ట్ జోన్ కి భిన్నంగా డిఫరెంట్ జానర్ కథను ఎంచుకున్నాడు. అన్నిటికీ మించి ఇప్పటివరకు అతడి సినిమాలకి ఇంత పాజిటివి బజ్ అనేది లేదు.

మరి శివ నిర్వాణ తనకు దొరికిన ఈ ఛాన్స్ ని సక్సెస్ ఫుల్ గా యూటిలైజ్ చేసుకొని.. దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. కాకపోతే.. ప్రస్తుతం సినిమాకి ఉన్న బజ్ కానీ, రవితేజ ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ పరంగా కానీ “ఇరుముడి” గ్యారెంటీ హిట్ అనిపిస్తోంది. శివ నిర్వాణ ఆ గ్యారెంటీని తన సినిమాతో నిలుపుకోగలిగితే చాలు.

ADVERTISEMENT
Latest Stories