“బాహుబలి”లో బంపర్ ఆఫర్ కొట్టేసిన ‘బ్యూటీ’

Shriya Saran in Baahubaliసెకండ్ ఇన్నింగ్స్ లో అన్ని అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఢిల్లీ భామ శ్రియా, మరో అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుందని టాలీవుడ్ టాక్. ‘బాహుబలి – ది కంక్లూజన్’లో రానా సరసన నటించేందుకు శ్రియాకు అవకాశం వచ్చిందని, ఇటీవలే వీరిద్దరిపై ఫోటోషూట్ కూడా జరిగిందని, వీరిద్దరి జోడి కన్నుల పండుగగా ఉండడంతో జక్కన్న శ్రియాకు ఓటు వేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ సెట్స్ లోకి త్వరలోనే శ్రియ జాయిన్ అవుతుందని తెలుస్తోంది. స‌రైన అవ‌కాశాలు లేక ఫేడౌట్ అయ్యే స్థితికి చేరుతున్న శ్రియకు ఇది పెద్ద ఆఫరనే చెప్పాలి. దీంతో నైనా శ్రియ సెకండ్ ఇన్నింగ్స్ కుదుట పడుతుందేమో చూడాలి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories